30న జయదేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంటా రవి, మాళవిక జంటగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్ రూపొందించిన చిత్రం 3జయదేవ్2. ఈ చిత్రానికి సం బంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ నెల 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో మంగళవారం సినిమా ప్రీ విడుదల వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అశోక్‌కుమార్ మాట్లాడుతూ- రవి డాన్స్, యాక్టింగ్, ఫైట్స్‌లో మంచి శిక్షణ పొందాడని, కృషి, పట్టుదల, దీక్షతో సినిమా రంగంలోకి వచ్చాడని, ఓ డైనమిక్ పోలీసు అధికారిగా పవర్‌ఫుల్‌గా నటించాడని తెలిపారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో ప్రతీ రిస్క్ షాట్‌ను ఈజీగా చేశారని, స్లోవేనియాలో చిత్రీకరించిన పాటలు అద్భుతంగా ఉంటాయని ఆయన అన్నారు. అండర్ ప్రొడక్షన్‌లోనే సినిమాకు బిజినెస్ పరంగా మంచి ఆఫర్లు వచ్చాయని, మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆయ అన్నారు. విధి నిర్వహణకోసం తమ కుటుంబాన్ని జీవితాలను త్యాగం చేసిన ఎంతోమంది పోలీసు అధికారుల కథల ప్రేరణతో ఈ పాత్రను డిఫరెంట్‌గా డిజైన్ చేశామని, ఆడియెన్స్ థ్రిల్‌కు గురయ్యే అనేక భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని దర్శకుడు జయంత్ తెలిపారు. నిర్మాత సినిమాను లావిష్‌గా నిర్మించారని, పాటల పిక్చరైజేషన్ బాగా ఉంటుందని, ఇటీవల విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. వినోద్‌కుమార్, పోసాని, వెనె్నల కిశోర్, హరితేజ, శ్రావణ్, సుప్రీత్, కోమటి జయరాం, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్, అరవింద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:మణిశర్మ, కెమెరా:జవహర్‌రెడ్డి, రచన:పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:కె.అశోక్‌కుమార్, దర్శకత్వం:జయంత్ సి.పరాన్జి.