వేటు పడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు దక్షిణాదిలో ఇటు ఉత్తరాదిలో తనకంటూ ఇమేజ్ సృష్టించుకున్న కథానాయిక శ్రుతిహాసన్. మొదట్లో సరైన అవకాశాలు రాని ఈమెకు ప్రస్తుతం వరుసబెట్టి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె జోరుకు చుక్కెదురైనట్లుంది. తమిళంలో తేనాండాల్ ఫిలింస్ సంస్థ ‘సంఘమిత్ర’ పేరుతో భారీ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్‌ను ఎంపికచేశారు. అందుకోసం విదేశాలకు వెళ్లి పలు యుద్ధ విద్యలలో శిక్షణ కూడా తీసుకుంది. ఉన్నట్టుండి ఆ సినిమాలో తాను నటించడంలేదని ప్రకటించింది. ఏమైంది అని విచారిస్తే, నిర్మాతలే ఆమెను సినిమానుండి తప్పించారన్న సత్యం తెలుస్తోంది. కథ పూర్తిగా సిద్ధం కాలేదని, అందుకే సినిమా వదులుకున్నానని శ్రుతిహాసన్ చెబుతుండగా, విదేశాల్లో శిక్షణ పేరుతోనే భారీగా పారితోషికాలు వసూలు చేస్తుండటంతో విసిగి తామే సినిమా నుంచి తప్పించామని నిర్మాతలు చెబుతున్నారు. సినిమా మేకింగ్ విషయంలో కూడా తలదూర్చడంతో తమకు నచ్చలేదని, ఆమెతో కలిసి పనిచేయలేని పరిస్థితులు ఎదురవ్వడంతో తామే తొలగించామని వారు చెప్పడం గమనార్హం.