ఎలాంటి పాత్రైనా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నువ్విలా’, ‘రామ్‌లీల’, ‘జీనియస్’ లాంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించిన హవీష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. జవహర్ బాబు, రమేశ్‌వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా హీరో హవీష్ వివరాలు తెలియజేస్తూ... రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నువ్విలా’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు వచ్చిందని, ఆ తరువాత చేసిన ‘రామ్‌లీల’ చిత్రం అనుకున్న విజయం సాధించకపోవడంతో మంచి కథలు ఎంచుకునేందుకు కాస్త టైం పట్టిందని అన్నారు. రొటీన్ చిత్రాలు చేయాలని లేదని, అందుకే మంచి కథల కోసం ఎదురు చూస్తుండగా రమేశ్‌వర్మ తెచ్చిన కథ బాగా నచ్చిందని చెప్పారు. ఇందులో హారర్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిసి వుంటుందని, ఐదుగురు హీరోయిన్లు వుంటారని, అలాగని తన పాత్ర ప్లేబోయ్ తరహాలో వుండదని అన్నారు. అన్నిరకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేస్తామని, ఈ సినిమాతోపాటు ఇదే బ్యానర్‌లో మరో చిత్రం కూడా ఉంటుందని. మరోవైపు మంచి అవకాశాలొస్తే నెగిటివ్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ప్రస్తుతం సోలో హీరోగానే సినిమాలు చేస్తానని, అలాగే రవిబాబు దర్శకత్వంలో మరో చిత్రం చేయాలని ఉందని అన్నారు.