నేనే క్వీన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ కాజల్‌కు ఈమధ్య కెరీర్ కాస్త వెనుకబడింది. చేసిన సినిమాలు వరస పరాజయాలు అందుకోవడంతో కొత్త అవకాశాలు అందకుండా పోయాయి. ప్రస్తుతం తెలుగులో రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మాత్రమే చేస్తున్న కాజల్ మళ్లీ తన సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. తాజాగా ఆమె తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కే ‘క్వీన్’ సినిమా రీమేక్‌లో నటించేందుకు అంగీకరించింది. అప్పట్లో హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్‌గా సౌత్‌లో నాలుగు భాషల్లో సినిమా తీయడానికి నిర్మాత త్యాగరాజన్ సన్నాహాలు చేస్తున్నాడు. కానీ ప్రతిసారీ సినిమాకు సమస్యలు వచ్చిపడుతునే ఉన్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్‌పైకి రానుంది. ఇదివరకే తమన్నాను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె చేయనని చెప్పడంతో ఆమె ప్లేస్‌లోకి కాజల్ చేరింది. ఇదివరకే కాజల్‌తో మంతనాలు జరిపిన త్యాగరాజన్ చివరికి ఆమెని ఒప్పించాడు.