హీరో ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శక ధీరుడు రాజవౌళి చిత్రంలో నటించాలని ఏ హీరోకు ఉండదు చెప్పండి. ముఖ్యంగా ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాన్ని తీసి అంతకంటే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన అంతకంటే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అనుకున్నారు. కానీ మినిమమ్ బడ్జెట్‌లోనే ఓ సాధారణ కమర్షియల్ సినిమా చేస్తానని చెప్పాడు రాజవౌళి. దాంతో ఆయన తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం కోసం కథ సిద్ధం చేసేపనిలో ఉన్నాడట. మరి రాజవౌళి తీసే తదుపరి చిత్రంలో హీరో ఎవరు అనే విషయంపై అంతటా ఆసక్తి నెలకొంది. రాజవౌళి దర్శకత్వంలో నటించిన హీరోలకు వాళ్ల కెరీర్‌లోనే మైలురాయిలాంటి చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా చేసే అవకాశం ఏ హీరోకి వస్తుంది. ఇప్పటికే హీరోలుకూడా రాజవౌళితో టచ్‌లో ఉంటున్నారట. మరి ఆ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసే హీరో ఎవరో చూడాలి.