ఆనంద్ దర్శకత్వంలో కొత్త సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం చిత్రంతో జోరుమీదున్నాడు అల్లు అర్జున్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమా తరువాత రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నాపేరు సూర్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పాల్గొననున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. ప్రస్తుతం ఆనంద్, అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి బాగా వస్తోందని ముఖ్యంగా దర్శకుడు టేకింగ్ బాగుందని అభినందించారట. దాంతోపాటు మంచి కథ ఉంటే తప్పకుండా చేద్దామని చెప్పాడని, దాంతో ఆనంద్ వెంటనే అల్లు అర్జున్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. శిరీష్ సినిమా అయిపోగానే అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు ఆనంద్ సన్నాహాలు చేస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.