కదిలే బొమ్మల కబుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరుణిక ఆర్ట్స్ పతాకంపై నాజర్, జీవ, ప్రియ, బాలు ప్రధాన తారాగణంగా అజయ్ రూపొందించిన చిత్రం ‘కదిలే బొమ్మల కథ’. శశిధర్.బి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. కాగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సినీ విశేషాలను చిత్ర యూనిట్ తెలిపింది. నిర్మాత అజయ్ మాట్లాడుతూ- సమాజంలో స్ర్తిలు డిప్రెషన్‌కు గురైనపుడు తమను తాము ఎలా మార్చుకోవాలి అనే పాయింట్‌ను హైలెట్ చేస్తూ క్రైం థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందించామని, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, ప్రొమోలకు మంచి అప్లాజ్ వచ్చిందని, మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. తెరమీద బొమ్మలు ఆడే కథలా కాకుండా సమాజంలో మహిళలు ఎలా బొమ్మలాటలాగా జీవిస్తున్నారు అన్న కథనాన్ని ఈ చిత్రంలో చర్చించామని, టెక్నికల్‌గా హైలెట్‌గా సాగుతుందని దర్శకుడు శశిధర్ అన్నారు.
మంచి కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు సత్య, కథే హీరోగా స్ర్తిలు తమను తాము కాపాడుకోవడానికి ఎలా మారాలి అన్న కథనంతో ఈ సినిమా రూపొందిందని కథానాయకుడు బాలు తెలిపారు. కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. శ్రీతేజ్, రవిప్రకాష్, గౌతమ్‌రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:తిరుమరావు.బి, సంగీతం:నరేష్ రావుల, ఎడిటింగ్:కార్తీక్ శ్రీనివాస్, నిర్మాత:అజయ్ మేరుగు, దర్శకత్వం:శశిధర్.బి.