బిగ్‌బాస్ షోలో నమిత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సంచలనం రేపిన బిగ్‌బాస్ టీవీ షో ఇప్పుడు తెలుగులోకి రానుంది. ఈ షోకి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నడ, హందీ భాషల్లో సూపర్‌హిట్ అయిన ఈ షోను తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. తమిళంలో కమల్‌హాసన్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ షో హౌస్‌లో ఎవరు పాల్గొంటారనే విషయం అందరిలో ఆసక్తి రేపుతోంది. తెలుగు షోలో ఎవరు పాల్గొంటారనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. తమిళ షోలో మాత్రం బొద్దుగుమ్మ నమిత పాల్గొంటుందట. ఈ విషయం తెలియడంతో అందరు షాక్ అవుతున్నారు. బొద్దుగుమ్మ నమిత హాట్ హాట్ అందాలతో కోలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికే కోలీవుడ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడికి ఈమధ్య సినిమాలు తగ్గాయి. దాంతో కాస్త సన్నబడేందుకు చేసిన ప్రయత్నం బాగానే ఫలించినట్టు తెలుస్తోంది. బాగా సన్నబడ్డ ఈమె ఈ షోలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ షోలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి!