ప్రేమలో మసక్కలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయిరోనక్, శ్రావ్య, శిరీష వంక ప్రధాన తారాగణంగా ఏనుగుబల దర్శకత్వంలో సుమిత్‌సింగ్ రూపొందిస్తున్న చిత్రం ‘మసక్కలి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. ఈ సందర్భంగా నిర్మాత సుమిత్‌సింగ్ మాట్లాడుతూ- స్వచ్ఛమైన ప్రేమకథకు దర్శకుడు అద్భుమైన విజన్ జోడించడంతో ఓ కావ్యంగా ఈ సినిమా రూపొందిందని, మసక్కలి అంటే ఏంటి అనేది సినిమాలోనే తెలుస్తుందని తెలిపారు. మ్యూజికల్‌గా సినిమా అందరినీ ఆకట్టుకునే పాటలు ఉన్నాయని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా వుంటుందని తెలిపారు. ప్రేక్షకుడికి పెట్టిన టికెట్‌కు పూర్తిన్యాయం ఈ సినిమాలో జరుగుతుందని, త్వరలో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు త్వరలో వస్తామని ఆయన వివరించారు.