ఓటర్ విష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో సుధీర్ కుమార్ పూదోట (జాన్) రూపొందిస్తున్న చిత్రం ‘ఓటర్’ (హీరో ఆఫ్ ది నేషన్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఐర్లాండ్‌లో రెండు పాటల చిత్రీకరణ పూర్తిచేశారు. మరో పాటను ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని, టాకీపార్ట్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. విష్ణు కెరీర్‌లో ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుందని, త్వరలోనే టైటిల్ లోగోను విడుదల చేసి ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు. సంపత్‌రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, ఎల్.బి.శ్రీరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:రాజేష్ యాదవ్, సంగీతం:ఎస్.ఎస్.తమన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.ఎస్.కార్తీక్.