వలస జీవితాల గల్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావ్యా ఫిలింస్ పతాకంపై చేతన్ మద్దినేని హీరోగా పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్.రామ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘గల్ఫ్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రచారంలో భాగంగా కథానాయకుడు ప్రచార చిత్రాన్ని హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - శివ పాత్రతో గల్ఫ్ చిత్రంలో నటించిన చేతన్, గల్ఫ్ వలసల జీవితంలో బ్లూ కాలర్ వర్కర్లకు ప్రతినిధిగా ఈ సినిమాలో నటించాడని, దాదాపు 25 లక్షల మంది తెలుగు రాష్ట్రాలనుండి గల్ఫ్‌కు ఉపాధికై వెళ్లారని, వారి జీవన చిత్రాన్ని వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాలో రూపొందించారని ఆయన అన్నారు. దుబాయ్, రసల్‌ఖైమా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా సరిహద్దులు దాటిన ప్రేమకథగా ప్రేక్షకులకు అనుభూతినిస్తుందని హీరో చేతన్ తెలిపారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపట్ల ప్రేక్షకులకు ఓ అవగాహన ఈ సినిమా ద్వారా కలుగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. డింపుల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సంతోష్ పవన్, అనిల్ కల్యాణ్, సూర్య, నల్లవేణు, నాగినీడు, డిగ్గి, పోసాని, జీవా, తనికెళ్ల భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిరి సత్తి, ప్రభాస్ శ్రీను, శంకరాభరణం రాజ్యలక్ష్మి, తీర్థ, సన, మహేష్, శివ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:ఎస్.వి.శివరాం, ఎడిటింగ్:కల్యాణ్ శామ్యూల్, సంగీతం:ప్రవీణ్ ఇమ్మడి, మాటలు:పులగం చిన్నారాయణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పి.సునీల్‌కుమార్‌రెడ్డి.