ఒక్క సినిమాతో ఇమేజ్ మారిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ తరువాత ఆ రేంజ్‌లో ఇమేజ్ తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయనకి ఈమధ్య కెరీర్‌కు బ్రేక్ పడింది. వెంట వెంట వస్తున్న పరాజయాలతో సతమతం అవుతున్న నరేష్, తన పరాజయాలకు బ్రేక్ వేయాలని ‘మేడమీద అబ్బాయి’గా వస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూ...

* ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి?
- ప్రత్యేకత ఏమీ లేదండి. అయితే ఈసారి పాపతో జరుపుకుంటున్నాను. తనకు ఇప్పుడు 9 నెలలు. ఇక ఇద్దరం కలిశామంటే ఒకటే అల్లరి.
* కెరీర్ ఎలా ఉంది?
- చాలా బాగుందండి. ప్రస్తుతం ‘మేడమీద అబ్బాయి’ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే షూటింగ్ అయిపోయింది. మొన్ననే గోవాలో ఓ సాంగ్ షూట్ చేశాం. తప్పకుండా నాకిది మంచి సినిమా అవుతుంది.
* ఇంతకీ ‘మేడమీద అబ్బాయి’ ఎలా ఉంటాడు?
- ఈ కథ నాకు బాగా నచ్చింది. మలయాళంలో సూపర్‌హిట్ అయిన సినిమాకు రీమేక్. కథలో కామెడీతోపాటు మంచి ఎమోషన్ ఉంటుంది. నా సినిమా అనగానే కామెడీ ఆశిస్తారు. అయితే ఈమధ్య కామెడీ మారిపోయింది. పైగా మన దగ్గర చాలామంది కమెడియన్స్ ఉన్నారు. వాళ్లకి మించి ఏదైనా చేయాలి, లేదంటే కష్టమే. ప్రస్తుతం సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి. దాని ప్రకారం కామెడీ కూడా ఎంచుకోవాలి. లేదంటే ఓవర్ యాక్షన్ చేసాడని అంటారు.
* వరుస పరాజయాలను ఎలా ఫేస్ చేశారు?
- మనం ఏదైనా సినిమాను సక్సెస్ అవుతుందనే చేస్తాం. కానీ ఫలితం మరోలా ఉండొచ్చు.. దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ ముందుకు వెళ్లాలి. ఈ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది.
* ఈమధ్య ఏ దర్శకుడితోనూ సింక్ అవ్వడంలేదు. మీ నాన్నగారితో వరుస సినిమాలు వచ్చినట్టు?
-కామెడీ సినిమా తీయాలంటే చాలా కష్టం. ఇక్కడ ఏ ఎమోషన్ అయినా డీల్ చెయ్యొచ్చు. కానీ కామెడీని కాదు. అయితే లక్కీగా నాన్నగారికి నాకు అలా సింక్ అయింది. ఆయనను నేను చాలా మిస్ అవుతున్నా తండ్రిగా, ఓ దర్శకుడిగా.
* ఈ సినిమాతో మీ ఇమేజ్ మారిపోతుందంటారా?
- అలా కాదండి. ఈ ఒక్క సినిమా నా ఇమేజ్‌ను మారుస్తుందనడం కరెక్ట్‌కాదు. నా సినిమాతో జనాలను నవ్వించాలని కోరుకుంటాను. దాంతోపాటు నేను చేసిన సినిమాకు దేనికి పోలిక ఉండకూడదు. అలా జాగ్రత్తలు తీసుకుంటా.. అయితే నాకు కామెడీ సినిమాలకంటే ‘శంభో శివశంభో’, ‘గమ్యం’ లాంటి పాత్రలే మంచి గుర్తింపును తెచ్చాయి.
* ‘మేడమీద అబ్బాయి’ ఎప్పుడు వస్తున్నాడు?
- షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంకా డేట్ నిర్ణయం కాలేదు.
* మీ ప్రొడక్షన్‌లో సినిమాలు తీస్తారా?
- దానికి ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతం సినిమాల పరిస్థితి బాగాలేదు. దానికి ఇంకా టైమ్ ఉంది.
* మహేష్ సినిమాలో నటిస్తున్నారంటూ
వార్తలొస్తున్నాయి?
- దాని గురించి ఇప్పుడే చెప్పలేను. ఆ సినిమా గురించి అయితే ఒకసారి అడిగారు. చూద్దాం..
* తమిళంలో సినిమా ఉంటుందా?
- ఇప్పుడైతే లేదు. ప్రస్తుతానికి దర్శకుడు సముద్రఖనితో చర్చలు జరిపా.. ఆయన కూడా రెండు భాషల్లో ఓ సినిమా ప్లాన్‌లో ఉన్నారు.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతానికి రెండు చిత్రాల గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలియజేస్తా.

-శ్రీ