హైదరాబాద్‌లో స్పైడర్‌మాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పైడర్‌మాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు లేడు. ముఖ్యంగా చిన్నపిల్లలకు స్పైడర్‌మాన్ మాత్రమే హీరోగా గుర్తొస్తాడు. ప్రస్తుతం హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషలలో స్పైడర్‌మాన్ సీరీస్‌లో మరో కొత్త సినిమా తెరకెక్కింది. స్పైడర్‌మాన్ హోమ్ కమింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో స్పైడర్‌మాన్ సందడి చేశాడు. నగరంలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో స్పైడర్‌మాన్ పలువురుతో ఫొటోలు, సెల్ఫీలు దిగి స్టంట్స్, విన్యాసాలు చేసి అబ్బురపరిచాడు. దేవనార్ బ్లైండ్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి హంగామా సృష్టించాడు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, పెద్దలతోపాటు పిల్లలను కూడా ఆకట్టుకుంటుందని, స్పైడర్‌మాన్ పాత్రలో కొత్త హీరో థామస్ స్టానే్ల హాలెండ్ నటించారని, ఆయనకు జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాప్ డబ్బింగ్ చెప్పడం మరో విశేషమని సోనీ ప్రతినిధులు తెలిపారు.