మెగాఫోన్ పట్టనుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామగా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శృతిహాసన్ టాప్ హీరోయిన్ రేసులో ఉంది. అయితే బాలీవుడ్‌పై ఈమె ఎక్కువ ఆశలు పెట్టుకోవడంతో సౌత్‌లో పెద్దగా సినిమాలు చేయడానికి సుముఖత వ్యక్తంచేయడం లేదు. ఇటీవలే ఆమె హిందీలో నటించిన ‘బెహెన్ హోగీ తేరి’ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో శృతి ఆశలు నీరుగారిపోయాయి. సౌత్‌లో అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనుకాడని ఈమెకు అవకాశాలకు కొదువలేదు. తాజాగా శృతిహాసన్ దర్శకత్వం వహిస్తుందని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే శృతి సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో దర్శకురాలిగా కూడా తన సత్తా చాటాలని తెగ ప్రయత్నాలు చేస్తోందట. స్వీయ దర్శకత్వంలోనే ఓ చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. అయినా హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న సమయంలో ఇలాంటి ఆలోచనలు ఎంతవరకు కరెక్టో ఆమెకే తెలియాలి.