జర్నలిస్టుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం పాతబస్తీలో జరుగుతోంది. భారీ బడ్జెట్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ జర్నలిస్టుగా నటిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- బేసిగ్గా జర్నలిజం స్టూడెంట్ అయిన శ్రద్ధాదాస్ ఈ పాత్రలో ఒదిగిపోయిందని, సన్నీలియోన్ పాట సినిమాకు హైలెట్ అవుతుందని తెలిపారు. నాజర్, చరణ్‌దీప్ రాజశేఖర్ అనుయాయులుగా నటిస్తున్నారని, ఆదర్శ్, శత్రు, రవిరాజ్‌లు ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా కనపడతారని, శ్రీనివాస్ అవసరాల కామెడీ హైలెట్‌గా వుంటుందని, అలీ సైకాలజిస్ట్ పాత్ర నవ్విస్తుందని తెలిపారు. పేషెంట్‌గా పృధ్వీ, రాజకీయ నాయకుడిగా పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:శ్రీచరణ్ పాకాల, కెమెరా:అంజి, ఎడిటింగ్:్ధర్మేంద్ర కాకరాల, దర్శకత్వం:ప్రవీణ్ సత్తార్.