పాటల్లో నిన్నుకోరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని, నివేదా థామస్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ‘నిన్నుకోరి’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు రాజవౌళి సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొరటాల శివ, హను రాఘవపూడి, డి.సురేష్‌బాబు, జెమిని కిరణ్, ఎన్.వి.ప్రసాద్, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజవౌళి మాట్లాడుతూ- ‘్ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఐడియా లాంఛ్ చేసే ఐడియా బాగుంది. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. సినిమాను గ్రాండ్‌గా తీశారు. ఎప్పుడెప్పుడు చూడాలన్న ఆసక్తి కలుగుతోంది’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ-‘బెస్ట్ టాలెంట్ అంతా కలిసి ఒక సినిమాకు పనిచేస్తే అది నిన్నుకోరి అవుతుంది. తెలుగులో అద్భుతమైన టాలెంట్ వున్న హీరో నాని. వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇందులోని పాటలు బాగున్నాయి. గోపీసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు’ అన్నారు. నాని మాట్లాడుతూ- ‘మంచి కథతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం చాలామంది ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇది’ అన్నారు.