శ్రీశాంత్‌తో టీమ్ 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ చరిత్రలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్ కథానాయకుడిగా రూపొందించిన చిత్రం ‘టీమ్ 5’. బైక్ రేసర్‌గా నటించిన ఆయన సరికొత్తగా ఈ చిత్రంలో కన్పించనున్నారని దర్శకుడు సురేష్ గోవింద్ తెలియజేస్తున్నారు. తమిళ, హిందీ, మలయాళ, తెలుగు భాషల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ జకారియాస్ కొచ్చి మాట్లాడుతూ- క్రికెటర్‌గా, బౌలర్‌గా పేరున్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఈసినిమాతో నటుడిగా సరికొత్త రూపంలో కన్పిస్తాడని, అడ్వెంచర్ స్పోర్ట్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం మొత్తం బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, యాక్షన్, మాస్, లవ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. సెన్సార్ పూర్తిచేసుకుని యు సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రం గోవా, బెంగుళూరు, ఆస్ట్రేలియాల్లో చిత్రీకరించామని, త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నామని ఆయన అన్నారు. నిక్కీ గల్రాని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:సజిత్ పరుషన్, ఎడిటింగ్:దిలీప్ డెన్నిస్, మాటలు:నందు తుర్లపాటి, పాటలు:వెనె్నలకంటి, సంగీతం:గోపీసుందర్, దర్శకత్వం:సురేష్ గోవింద్.