14న దండుపాళ్యం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజాగాంధి, రవిశంకర్, రఘు ముఖర్జి, సంజన ముఖ్యపాత్రల్లో శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన దండుపాళ్యం-2 చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ వివరాలు తెలియజేస్తూ- దండుపాళ్యం మొదటిభాగం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదలవుతున్న చిత్రమిదని, రియల్ సంఘటనల నేపథ్యంలో నాచురల్‌గా దర్శకుడు శ్రీనివాసరాజు రూపొందించాడని, దండుపాళ్యానికి మించిన విజయాన్ని దండుపాళ్యం-2 అందుకుంటుందన్న నమ్మకం ఉందని అన్నారు. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ- సినిమా మొదటినుంచి చివరివరకూ ప్రతీ సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుందని, భిన్నమైన సినిమాలను ఆరాధించే ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త ఫీల్‌ను కలిగిస్తుందని అన్నారు. భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు నటించారు.