వినూత్నంగా 2.0 ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు శంకర్ సినిమాలంటే భారీతనంతోపాటు కొత్తదనాన్ని కలిగివుంటాయి. ముఖ్యంగా తన సినిమాలకు ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపేందుకు ఆయన ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిస్తున్న రోబో 2.0 సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలోనే ఆడియో జరుపుకోనుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ (లాస్‌ఏంజెల్స్)లో భారీ ఎయిర్ బెలూన్లను ఎగరవేసి సంచలనం రేపాడు. దాదాపు 100 అడుగుల ఎత్తులో వుండే ఈ హాట్ ఎయిర్ బెలూన్ విషయం హాట్ టాపిగ్గా మారింది. కాలిఫోర్నియా, లాంకోస్టర్, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర ప్రాంతాల్లో ఈ బెలూన్లను ఎగురవేశారు. త్వరలోనే యూరప్, లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా, ఇండియాలో కూడా ఈ తరహా ప్రచారాన్ని చేయనున్నారట.