హీరోగా పటేల్ సార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగపతిబాబు కధానాయకుడిగా మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నారు. కారెక్టర్ ఆర్టిస్టుగా విలన్‌గా నటిస్తున్న ఆయన తిరిగి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పటేల్ సార్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. వారాహి చలనచిత్రం పతాకంపై వాసు పరిమి దర్శకత్వంలో రజని కొర్రపాటి రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ కానె్సప్ట్ టీజర్‌కు 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా కొర్రపాటి సాయి మాట్లాడుతూ యూట్యూబ్‌లొ విడుదల చేసిన ‘పటేల్‌సార్’ టీజర్‌కు మంచి క్రేజ్ వచ్చిందని, షూటింగ్ సజావుగా సాగుతోందని తెలిపారు. హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో జగపతిబాబు యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా సాగాయని, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. పద్మప్రియ, తాన్యాహోప్, పోసాని, సుబ్బరాజు, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, కబీర్‌సింగ్, పృధ్వి, బేబీ డాలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: బాలాజీ, రాము, వసంత్, రాంబాబు. మాటలు: ప్రకాశ్, సంగీతం: వసంత్, కెమెరా: శ్యామ్ కె నాయుడు, నిర్మాత: రజని కొర్రపాటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాసు పరిమి.