గడ్డకట్టే చలిలోనూ డాన్స్ చేయించా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వైశాఖం చిత్రంలో ప్రతి పాటా వైవిధ్యంగా ఉంటుంది. దర్శకురాలు జయకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేయడం మరిచిపోలేని అనుభవం’ అని డాన్స్ మాస్టర్ శేఖర్ విజె తెలిపారు. ఆర్‌జె సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందించిన చిత్రం వైశాఖం. హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ట్రైలర్లకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రానికి కొరియోగ్రఫీ నిర్వహించిన శేఖర్ విజె సినిమా విశేషాలు తెలిపారు.
నేపథ్యం
‘విజయవాడ నుండి 96లో హైదరాబాద్ వచ్చా. రాకేష్ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా చేసా. తొమ్మిదేళ్ల క్రితం కొరియోగ్రాఫర్‌గా మారా. అప్పటినుండి ఇప్పటి దాకా దాదాపు 500 పాటలకు కొరియోగ్రఫీ చేసా. ముఖ్యంగా ఏడాది కాలంగా ఎక్కువ పాటలకు పనిచేసా. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘ఎస్‌ఎంఎస్’లో ఇది నిజమే పాటకు మంచి పేరు వచ్చింది. తర్వాత ‘బాద్‌షా’కు చేసా. చిరంజీవి 150వ సినిమాలో రెండు పాటలకు చేసాను. రీసెంట్‌గా డీజెలో సీటీమార్ పాటకు మంచి పేరు వచ్చింది. ‘జనతా గ్యారేజి’లో పక్కాలోకల్ సాంగ్ కూడా నేనే చేసా’
కొత్తవారైనా
ఇప్పటివరకు ఏ సినిమాకు షూటింగ్ చేయని కజకిస్తాన్‌లో ‘వైశాఖం’ పాటలను చిత్రీకరించాం. భానుమతి కమాన్, కమాన్ కంత్రీచిలకా, దగ్గరకు రావద్దు అనే మూడు పాటలను నా కంపోజిషన్‌లో అక్కడ చిత్రీకరించాం. మైనస్ 5 డిగ్రీల చలిలో హీరో హీరోయిన్లతో డాన్స్ చేయించడం చాలా కష్టమైన విషయం. వారిద్దరు కొత్తవారైనా బాగా చేసారు.
రాజీలేదు
దర్శకురాలు జయ మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ అనే మాట వినలేదు. అక్కడ కజకిస్తాన్‌లో మంచి డాన్సర్లు ఎవరో ఆడిషన్స్ చేసి సెలక్టు చేసుకుని షూటింగ్ చేసాం. సినిమా మేకింగ్ ఎక్కడా చిన్న సినిమాలా అనిపించదు.
చిరంజీవితో డాన్స్
చిరంజీవిని చిన్నప్పటినుండి స్క్రీన్‌పై చూసాను. ఇప్పుడు ఆయనకు డాన్స్ కంపోజ్ చేసే అవకాశం రావడం గొప్ప విషయం. ‘మి..మి..మిమ్మిమ్మి’, ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాట చేసాం. డాన్స్ కంపోజ్ చేసేటప్పుడు చిరంజీవి మాస్టర్ ఎలా చెబితే అలా చేస్తాననే అన్నారు తప్ప ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. చిరంజీవి, చరణ్ చేసిన స్టెప్స్ తెరపై చూసిన తర్వాత చాలా సంతోషించాను.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘రంగస్థలం 1985’ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ జై లవకుశ చిత్రానికి పనిచేస్తున్నా.

-యు