కత్తిరెడ్డి హంగామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కత్తిరెడ్డి’ అనే టైటిల్ వింటేనే విచిత్రంగా ఉంది కదూ. ఇంతకీ ఈ రెడ్డిగారు అంటే బ్రహ్మానందం. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. ‘ఎత్తితే దించడు’ అనే టాగ్‌లైన్‌కూడా ఈ సినిమాకు ఉంది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ‘జబర్దస్త్’ ఫేమ్ రచ్చరవి కూడా నటిస్తున్న ఈ చిత్రానికి రవివర్మ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం లేకుండా అనేక సినిమాలు వస్తున్న నేపథ్యంలో తన హవా చాటుకోవడానికి ఆయన మళ్లీ ఇలాంటి ఓ సినిమా చేస్తున్నాడు అని టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త. సో కత్తిరెడ్డి చేసే హంగామా చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.