ఇగో మొదలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా వికెఎ ఫిలింస్ పతాకంపై ఆర్.వి.సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో కెఆర్ విజయ్‌కరణ్, కెఆర్ కౌశల్‌కరణ్, కెఆర్ అనిల్‌కరణ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇగో’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో జరిగింది. తొలి సన్నివేశంపై సంగీత దర్శకుడు సాయి కార్తీక్ క్లాప్ ఇవ్వగా, శ్రీనివాస్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఆకతాయి’ సినిమా తర్వాత తమ సంస్థ రూపొందిస్తున్న రెండో చిత్రం ఇదని, రేపటినుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మూడు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తిచేసి దసరా కానుకగా విడుదల చేస్తామని తెలిపారు. రెండు షెడ్యూల్స్‌ను ఆర్‌ఎఫ్‌సిలో, మూడో షెడ్యూల్‌ను ఆంధ్రలో చేస్తామని అందరికీ నచ్చేలా సినిమా రూపొందుతుందని దర్శకుడు తెలిపారు. ఇద్దరు ఇగోయిస్టుల మధ్య నడిచే ప్రేమ కథ సిటీ, గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని అన్ని ఎమోషన్లు సినిమాలో వుంటాయని అన్నారు. కార్యక్రమంలో ఆకాశ్, వీరశంకర్, సిమ్రాన్ చిత్ర విశేషాలను తెలిపారు. రావురమేశ్, నరేష్, పృధ్వి, పోసాని, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, బాలాజీ, కెమెరా: ప్రసాద్ జి.కె., సంగీతం: సాయి కార్తీక్, కథ,మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌వి సుబ్రహ్మణ్యం.