నెగెటివ్ పాత్రలో శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, శ్రీకాంత్ కథానాయకులుగా వారాహి చలనచిత్ర పతాకంపై ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘యుద్ధం శరణం’ అనే పేరును ఖరారు చేసారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టీజర్, ఆడియోలను త్వరలో విడుదల చేయనున్నట్టుగా నిర్మాతలు చెబుతున్నారు. శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ సందర్భంలో నిర్మాత సాయి కొర్రపాటి మాట్లడుతూ నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యుద్ధం శరణం’. ఈ కథకు తగిన పేరు ఇది. నాగచైతన్య లుక్స్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా వుంటుందని, శ్రీకాంత్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని, మురళిశర్మ, రేవతి పాత్రలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. షూటింగ్ ముగింపు దశలో ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా చేస్తున్నామని, ఈ నెల 15న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నామని తెలిపారు. ఆడియోను కూడా ఇదే నెలలో విడుదల చేసి, ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు. లావణ్య త్రిపాఠీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ ఆర్.నాదన్, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్‌వి మారిముత్తు.