త్వరలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ దర్శకుల రేస్‌లో ఉన్న త్రివిక్రమ్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి ఎన్టీఆర్‌తో చేయనున్నాడు. నిజానికి వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ కమిట్ ఉండడంతో ఆలస్యమైంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమా పూర్తి కావస్తుండడంతో తన తరవాత చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని వినికిడి. ఇదివరకే ఓసారి చర్చలు జరిపినా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఫైనల్ కాపీ సిద్ధమవుతోంది. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడానికి సిద్ధమవుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రం నవంబర్‌నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.