గుండుతో నటిస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా కోసం హీరోలు గుండు కొట్టించుకోవడం మనం ఇదివరకే చూసాం. కానీ లేటెస్టుగా ఓ హీరోయిన్ నిజంగా గుండు కొట్టించుకోవడం షాక్ కలిగిస్తుంది? ఆ వివరాల్లోకి వెళితే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణ, ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది. అయితే ఈమెకు రావలసినంత కమర్షియల్ విజయం మాత్రం దక్కలేదు. దాంతో నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. తాజాగా శశికుమార్ నటిస్తూ నిర్మిస్తున్న కోడివీరన్ సినిమాలో హీరోయిన్‌గా పూర్ణ నటిస్తోంది. కొంబన్, మారుదు లాంటి చిత్రాలు రూపొందించిన ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూర్ణ పాత్రే కీలకంగా ఉంటుందట. అందుకోసం పూర్ణ తన జుట్టును త్యాగం చేసి.. గుండు కొట్టించుకుంది. పాత్ర డిమాండ్‌ని బట్టి గుండు చేయించుకున్నట్టు పూర్ణ తెలిపింది. నిజానికి గుండుతో నటించాల్సివస్తే.. విగ్‌తో సరిపెడతారు. కానీ.. ఇలా పూర్ణ నిజంగా గుండు కొట్టించుకోవడం అభిమానులకు షాక్ ఇస్తుంది. ఇదేనేమో డెడికేషన్ అంటే!