చాలా తెలుసుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో చేతన్ మద్దినేని, డింపుల్ ప్రధాన తారాగణంగా యెక్కలి రవీంద్రబాబు, ఎం.రామ్‌కుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘గల్ఫ్’. విడుదలకు సిద్ధమైన చిత్రం గురించి హీరో చేతన్ మద్దినేని పలు విశేషాలు తెలిపారు.
నేపథ్యం
మాది వైజాగ్. చిన్నప్పుడు రిషివ్యాలీలో చదివాను. ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసా. నాన్న అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్నారు. నా తొలి చిత్రం ‘రోజులు మారాయి’.
పాత్ర గురించి..
‘గల్ఫ్’ చిత్రంలో శివ అనే కుర్రాడిగా నటించాను. సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందినవాడు శివ. తన గ్రామంలో గల్ఫ్‌కు వెళ్లిన స్నేహితులను చూసి తానూ వెళ్లాలనుకుంటాడు. పలు ఇబ్బందులు పడి అక్కడికి వెళ్లిన అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేదే పాత్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది ప్రజలకు ప్రతినిధిగా ఈ పాత్ర కనిపిస్తుంది. డింపుల్‌కు, నాకు మధ్య క్యూట్ లవ్ స్టోరీ వుంటుంది.
తేడాలున్నాయ్
తొలి చిత్రం ‘రోజులు మారాయి’ మలిచిత్రం ‘గల్ఫ్’ చిత్రంలో పాత్రలకు చాలా తేడా వుంది. దర్శకుడి వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఆయన రూపొందించిన స్వంత ఊరు రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమకథలు చూసా. రియాలిటీకి దగ్గరగా వుంటాయి. శివ పాత్రలో అన్ని భావోద్వేగాలు పలుకుతాయి. మారుతి రూపొందించే ఓ కన్నడ చిత్రం రీమేక్‌లో ప్రస్తుతం నటిస్తున్నాను. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.