అవార్డు వరించిన రక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా బంగారు తల్లి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు రాజేష్ టచ్‌రివర్, నిర్మాత సునీతా కృష్ణన్‌లు రూపొందించిన తాజా చిత్రం ‘రక్తం’. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేదరింగ్ 2017లో అవార్డులు గెలుచుకుంది. ‘్ఫరిన్ డ్రామా ఫీచర్స్ సిగ్మెంట్’లో ఈ అవార్డు రావడం విశేషం. సంజు శివరామ, మధుశాలిని ప్రధాన తారాగణంగా నటించారు. నక్సలైట్ వర్గానికి చెందిన కథాంశంతో రూపొందించిన ఈ సినిమాలో- విప్లవానికి ఆలోచనాత్మక విధానంలో ఎదురవుతున్న సంఘర్షణలు ఉంటాయి. ఆల్బర్ట్ థామస్ లెస్‌జెస్టిస్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను కరీంనగర్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశారు. మధుశాలిని డీగ్లామర్ పాత్రలో నటించడం మరో విశేషం. బెనర్జీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో సన, బిందు, జాన్ కొట్టోలి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.