శమంతకమణి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శమంతకమణి’. నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్నారు. చాందిని చౌదరి, జెన్ని హనీ నాయికలు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సీడీలను విడుదల చేశారు. నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ- ‘ఇందులో హీరో ఎవరనేది నాక్కూడా తెలియడం లేదు’ అన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ- ‘ఈ కథ రాసుకునేటప్పుడు ఉద్యోగం మానేశాను. ఆ టైమ్‌లో నాకు మా నాన్న ఆరునెలలు శాలరీ ఇచ్చారు.
నేను మొదట రాసుకున్న కథలోనే నలుగురు హీరోలు అనుకున్నా. మా అమ్మ నాకు ధైర్యం ఇచ్చింది. మా ఆవిడ చాలా హెల్ప్ చేసింది. శ్రీరామ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. తను నాకు చాలా హెల్ప్ చేశాడు. నేనెంత ఎగ్జైట్ అయ్యానో మా నిర్మాత అంత గొప్పగా ఎగ్జయిట్ అయ్యారు. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత అనే్న రవికి చాలా థాంక్స్. మా హీరోలందరూ నాకు సోదరులులాంటివారు. ఆదికి చాలా గొప్ప ఎనర్జీ ఉంది. సందీప్‌కి, నాకూ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సుధీర్ చాలా ఫోకస్‌గా ఉంటారు. చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. తనని చూస్తే మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినా వెంటనే పెరుగుతాయి. రాజేంద్రప్రసాద్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. మా సినిమాలో హీరో హీరోయిన్లు ఉండరు. అందరూ క్యారెక్టర్లే ఉంటారు. నేను ఈ సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. సందీప్, ఆది, సుధీర్‌బాబు, నారా రోహిత్ లాంటి నలుగురు స్టార్లతో మల్టీస్టారర్ చిత్రంగా ఈ సినిమా రూపొందిందని, ఈ నలుగురిలో ఎవరు ముందు తనకు డేట్స్ ఇస్తే వారితో సినిమా చేస్తానని పూరి జగన్నాథ్ అన్నారు. రాజేంద్రప్రసాద్‌తో చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. పైసా వసూల్ ఫంక్షన్ త్వరలో జరగనుందని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆయన కోరుకున్నారు.