బల్గేరియాకు పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిపారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇక్కడే షూటింగ్ జరిపి తదుపరి షెడ్యూల్‌ను బల్గేరియాలో జరపనున్నారు. ఈ షూటింగ్ కోసం యూనిట్ బల్గేరియా వెళ్లనుంది. ఇటీవలే ఖైది నెం 150 సినిమాలోని పాటలు కూడా అక్కడే చిత్రీకరించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తారట.
పవన్ సినిమాతో నితిన్
ఆచి తూచి సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు యువ హీరో నితిన్. ‘అ ఆ’ తరువాత క్రేజ్ పెరిగిన నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘లై’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే అమెరికాలో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. మరో షెడ్యూల్‌ను త్వరలో జరపనున్నారు. ఈ సినిమా తరువాత పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో నిర్మించే సినిమాలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నాడు నితిన్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ 40 రోజులపాటు జరగనుందట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మేఘా ఆకాష్ నటిస్తుందట.