నిజమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల నాయిక తాప్సీకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపే వస్తోంది. దక్షిణాదిలో ఎన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు సక్సేస్ అందలేదు. బాలీవుడ్‌కు వెళ్లిపోయిన ఆమె పలు సినిమాలకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతోపాటు బాలీవుడ్ హీరోతో ఘాటైన ప్రేమాయణం కూడా నడిపిస్తోందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. తాజాగా తాప్సీ ప్రేమికుడితో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో నటించిందట. దాంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి ప్రేమలో పడ్డారని, వీరిద్దరు కలిసివున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ హీరోపేరు చెప్పలేదు కదూ! సాకిబ్ సలీం. వీరిద్దరిపై వస్తున్న వార్తలకు తాప్సీ స్పందించి ప్రచారం జరుగుతున్నట్టుగా తమ మధ్య ఎటువంటి బంధం లేదని, అతను తనకు స్నేహితుడు మాత్రమేనని ఇద్దరం ఢిల్లీకి సంబంధించిన వాళ్లం అవడంతో మరి కొంత స్నేహం పెరిగిందని సాకిబ్ సలీం కూడా చెప్పాడు. అయితే తాప్సీతో కలిసి పార్టీలకు వెళ్లడం ఆనందంగా వుందని అతను చె బుతుండడం విశేషం.