ప్రత్యేక పాటల్లేవ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్‌గా తెలుగు తెరపై అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న కేథరీన్‌కు మొదట్లో అన్ని పరాజయాలే దక్కాయి. పైసా, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలు కూడా ఈమెకు కమర్షియల్‌గా విజయాన్ని అందించలేకపోయాయి. దాంతో తమిళంలో సినిమాలు చేసి అక్కడ క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్యే అల్లు అర్జున్ సరసన సరైనోడులో నటించిన కేథరిన్‌కు ఆ సినిమాతో మంచి ఇమేజ్ దక్కింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈమె, మరోవైపు ప్రత్యేక పాటల్లో కూడా నర్తిస్తోంది. కొద్దిలో మెగాస్టార్ సరసన ఐటెమ్ సాంగ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న కేథరిన్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న జయ జానకి నాయక సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది. మరోవైపు హీరోయిన్‌గా రవితేజ సరసన ‘టచ్ చేసి చూడు’, రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాల్లో నటిస్తున్న ఈమె, ఇకపై ఐటెం సాంగ్స్ చేయదట. సినిమాల్లో హీరోయిన్‌గానే మంచి పాత్రలు చేస్తానని, ఇకపై ఐటెం సాంగ్స్ జోలికి వెళ్లనని చెప్పడం విశేషం.