బాలయ్య రూలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంద సినిమాల తరువాత వేగం పెంచాడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన తాజాగా నటిస్తున్న 101వ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పైసావసూల్ అనే టైటిల్ నిర్ణయించారు. దసరా సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా తరువాత ఆయన ఇప్పటికే 102వ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రెడ్డిగారు అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత జయసింహ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా రూలర్ అనే టైటిల్‌ను పెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిష్టర్ చేయించడంతో ఈ సినిమాకు రూలర్ పేరు పక్కా అయ్యేలా వుంది. ప్రస్తుతం టైటిళ్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న బాలయ్య, సింహ, లయన్, లెజెండ్, డిక్టేటర్ లాంటి పదాలకు ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించనుంది.