334వ కథలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైలాష్, అభిషేక్, చంద్రశేఖర్ ప్రధాన తారాగణంగా క్రియేటివ్ మైండ్ ప్రొడక్షన్, శ్రావణి మీడియా కమ్యూనికేషన్స్ పతాకాలపై వెంకట్ నారాయణ దర్శకత్వంలో చంద్రనాగ్ చెంగల రూపొందించిన చిత్రం మూడు వందల ముప్ఫై నాలుగో కథ. శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం చాంబర్ హాల్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత చంద్రనాగ్ మాట్లాడుతూ, ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమా అందించాలన్న కోరికతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. 333 కథలు వున్న ఓ పాత పుస్తకం చుట్టూ తిరిగే కథ ఇదని, అయితే 334వ కథ ఏమిటనేదే సినిమా చూసి తెలుసుకోవాలని అన్నారు. రెండు గంటల వ్యవధిలో ఓ కథ చెప్పి ప్రేక్షకుణ్ణి ఒప్పించడం చాలా కష్టమైన పని అని, అలాంటిది ఈ చిత్రంలో హారర్, సస్పెన్స్, రొమాన్స్, యాక్షన్ ప్లస్ థ్రిల్ లాంటి ఐదు జోనర్స్ మిక్స్ చేస్తూ ఐదు కథలు చెప్పడం వైవిధ్యంగా సాగుతుందని తెలిపారు. ఈ కథలన్నింటిలో అండర్ కరెంట్‌గా వున్న మెయిన్ ప్లాట్‌కు లింక్ చేస్తూ ఇంటర్‌వెల్‌లో ట్విస్ట్ ఇచ్చి రెండో భాగాన్ని హైస్పీడ్‌తో క్లైమాక్స్‌ను రివీల్ చేస్తూ సాగుతుందని అన్నారు. అంతవరకు చెప్పిన ఆరు కథలకి సింగిల్ క్లైమాక్స్ ఇవ్వడం అనేది అతి కష్టమైన స్క్రీన్‌ప్లే రాసుకొని ఈ సినిమా రూపొందించామని తెలిపారు. వినడానికే వింతగా వున్నా ప్రేక్షకుడికి ఎక్కడా కన్‌ఫ్యూజ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగి సింపుల్ కథ ఇదని, సహజంగా సినిమాలో మూడు నాలుగు ట్విస్టులు వుంటే ఈ చిత్రంలో వందకుపైగా ట్విస్టులు ఉంటాయని, చేతిలో మొబైల్‌లో ప్రపంచాన్ని చూసేస్తున్న ప్రేక్షకుడిని అగ్రనటులు లేని చిన్న సినిమాకు లాక్కురావాలంటే ఏదో ఒకటి చేయాలని రిస్కు చేశామని అన్నారు. ప్రేక్షకుడికి కొత్తరకం ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రూపొందిన ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని, ఈనెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కరణ్, ప్రియ, మధు, వర్ష, రాధిక, సందీప్, వినయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:జాన్.ఎస్, ఎడిటింగ్:నికోలస్ భూతపాటి, ఆర్ట్:కిరణ్, నిర్మాత:చంద్రనాధ్ చెంగల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్వకత్వం:వెంకట నారాయణ.