‘దర్శకుడు’ పాటను ఆవిష్కరించిన సమంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ‘కుమారి 21 ఎఫ్’ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘దర్శకుడు’. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బిఎస్‌సిఎస్‌పి విజయకుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని ‘సండే టు సాటర్‌డే లవ్’ అనే పాటను ప్రముఖ కథానాయిక సమంత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ- ‘ప్రేమకు, తపనకుమధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరులైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాయి కార్తీక్ అందించిన పాటలను ఒక్కొక్కటి విడుదల చేసి.. ఆ తర్వాత పూర్తి ఆడియోను ఈనెల 15న ప్రముఖ కథానాయకుడి చేతులమీదుగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఇప్పటికే ఓ పాటను ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ విడుదల చేశారని, ఈ పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. అశోక్ నటన, హరిప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని తెలిపారు.