ఇష్టపడి తీసిన వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ లాంటి చిత్రాలతో మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన జయ.బి తాజాగా రూపొందించిన చిత్రం ‘వైశాఖం’. ఆర్.జె.సినిమాస్ పతాకంపై హరీశ్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని బి.ఎ.రాజు రూపొందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ చెప్పిన విశేషాలు..
షూటింగ్ చాలా కష్టం
వైశాఖం షూటింగ్ ఓ రకంగా చాలా కష్టమైనదనే చెప్పాలి. అప్ అండ్ డౌన్స్ ఈ సినిమా కోసం చాలా ఎదుర్కొన్నాం. అనుకున్నది అనుకున్నట్టు రావాలంటే చాలా విషయాలు కలిసిరావాలి. అందుకోసం చాలా కష్టపడ్డాం. ఖజకిస్తాన్‌లో షూటింగ్ చేయడమే చాలా కష్టమైంది. 23మంది యూనిట్‌తో 400 కేజీల లగేజీతో 15 రోజులు ప్రయాణం చేసి పాటలు తీశాం. పాస్‌పోర్ట్‌లు రావడానికే మూడు నెలలు పట్టింది. మూడు రోజులకొకసారి పాస్‌పోర్ట్ స్టాంపింగ్ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మూడు నెలలు జైలు తప్పదు.
తేడా ఉంది
ఈ సినిమా కోసం అందరూ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. నేను కూడా విడుదల కోసమే ఎదురుచూస్తున్నా. ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూడాలనే కోరిక రోజురోజుకూ ఎక్కువవుతోంది. గత సంవత్సరం నుంచి ఈ సినిమా కోసమే అనేక జాగ్రత్తలు తీసుకున్నా. బడ్జెట్‌లో సినిమా తీసి ఇంట్రెస్ట్ పెరగకుండా నిర్మాతకు బర్డెన్ కాకుండా చేయాలనుకున్నాను. నేను గతంలో తీసిన సినిమాలకు ఈ సినిమాకు చాలా తేడా మీకు కనిపిస్తుంది.
కొత్త ఫీల్ లేదు
ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులంతా బాగా చేశారు. హీరో హీరోయిన్లుగా నటించిన హరీశ్, అవంతిక మంచి పేరు తెచ్చుకున్నారు. పరిశ్రమకి కావాల్సిన వాళ్లుగా మారతారు. హీరో మంచి బిహేవియర్ వున్న వ్యక్తి. కొత్తవాళ్లను చూస్తున్నామన్న ఫీల్ ప్రేక్షకులకు ఎక్కడా కలగదు. సాయికుమార్ పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్రే సినిమాకు మలుపు.
బేసిగ్గా లవ్‌స్టోరీ
ప్రేక్షకులు ఓ సినిమా చూస్తున్నామనేదానికన్నా ఓ జీవితాన్ని చూస్తున్నాము అని అనుకోవడం గ్యారంటీ. పాటలు చూసినవారు, సినిమా చూసినవారు చాలా బాగుంది అన్నారు. నిజ జీవితంలో ఎన్నో సంఘటనలు తాము ఎదుర్కొన్నామని అనేకమంది చెప్పారు. ఇంత మంచి సినిమా తీసినందుకు సెన్సార్ వారుకూడా యు/ఎ సర్ట్ఫికెట్ ఇచ్చారు. రొమాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ‘ఎ’ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. బేసిగ్గా ఇదో లవ్‌స్టోరీ. సింగిల్ కట్ కూడా సెన్సార్‌వారు చెప్పలేదు. సింగిల్ ఫ్రేమ్‌లో కూడా రాజీపడలేదు.
బడ్జెట్ ఎక్కువే
ఈసారి ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువైంది. ఎందుకంటే ఛాలెంజింగ్‌గా తీసుకున్న సినిమా కనుక. పాటల విషయంలో పట్టుదలతో వసంత్‌తోనే బాణీలు కట్టించా. కంట్రీ చిలక.. అన్న పాట వారం రోజులు విని వాడుకోవాలా వద్దా అని నిర్ణయించాను. విజువల్‌గా ఆడియెన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాం. ఇప్పటివరకూ సినిమాలో పలానా పాట బాగలేదని, సన్నివేశం బాగోలేదని చెప్పినవారు లేరు.
అపార్ట్‌మెంట్‌లో
ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. అన్నీ మినీ ఫ్యామిలీస్. పల్లెటూళ్లలో కూడా అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చింది. అందరూ అపార్ట్‌మెంట్‌నే ఇష్టపడుతున్నారు. ఇందులో రకరకాల మనుషులుంటారు. వారిమధ్య వచ్చే క్లాషెస్, ఉండే రిలేషన్స్ ఎలా ఉంటాయి అనే ఓ యదార్థ కథనంతో ఈ సినిమాలో చెప్పాం. వైశాఖం విజయవంతమయ్యాకే మరో సినిమా గురించి ఆలోచిస్తా.

-శ్రీ