విభిన్నమైన సినిమాలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నారా రోహిత్. భిన్నమైన కథలను ఎంచుకుంటూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం శమంతకమణి. సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆదిలతో కలిసి నారా రోహిత్ నటించిన ఈ చిత్రం గూర్చి ఆయన చెప్పిన వివరాలు. దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఒప్పుకున్నాను. తనకు కథపై మంచి క్లారిటీ వుంది. ఇందులో హీరోలుగా కంటే పాత్రల ద్వారానే మేం కన్పిస్తాం. నేను రంజిత్‌కుమార్ అనే పోలీసు అధికారిగా భిన్నమైన పాత్రలో నటించాను. ఇందులో నలుగురం హీరోలు ఉన్నా కూడా ఒకరి పాత్ర ఎక్కువా తక్కువా ఉండదు. అందరికీ సంబంధించిన అన్ని ఎమోషన్స్ ఉంటాయి. తప్పకుండా నాకు మంచి గుర్తింపునిచ్చే పాత్ర ఇది. ఇక తదుపరి చిత్రాలు వీరభోగ వసంతరాయలులో సుధీర్‌బాబుతో కలిసి చేస్తున్నా. అలాగే పవన్ మల్లెల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. దానికోసం బరువు తగ్గాల్సి వచ్చింది. అది భిన్నమైన కమర్షియల్ సినిమా. దాంతోపాటు మరో ప్రాజెక్టు కూడా చర్చల దశలో ఉంది. నేను కమర్షియల్ సినిమాలే చేస్తానని అనుకోలేదు. నాకు నచ్చిన కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తా.