టాలీవుడ్‌లో డ్రగ్స్‌పై అటాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులు డ్రగ్స్ వాడుతున్నారన్న వార్త దావానలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయంటూ ఇటీవల తెలంగాణ ఎక్సయిజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మీడియాలో కొందరు సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల పేర్లు హల్‌చల్ చేశాయి. మత్తుమందు వ్యాపారంలో ఆరితేరిన స్మగ్లర్ కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో అధికారులు ఈ డ్రగ్స్‌ను ఎవరెవరు ఉపయోగిస్తున్నారన్న విషయంపై లోతుగా పరిశోధించారు. దీని ఆధారంగానే తెలుగు సినిమా రంగంలో వున్న పలువురికి తమ కార్యాలయానికి వచ్చి డ్రగ్స్ విషయంపై సంజాయిషీ ఇచ్చుకోవలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఎక్సైజ్ అధికారులు డైరెక్టుగా తమ పేర్లను మీడియాలో బయటపెట్టడం, నోటీసులు అందడం పట్ల సినీతారలు ఒక్కొక్కరుగా డ్రగ్స్ విషయంపై తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగానికి చెందినవారు ఈ డ్రగ్ మాఫియాతో సంబంధాలు కలిగివున్నారు అని మొదట చెప్పినపుడు ఇది సర్వసాధారణంగా వినిపించే విషయమేనని, ఇలా ఎందుకు జరుగుతుందో తనకు తెలుసని, ఈ అంశంపై ట్విట్టర్‌లో తాను వ్యాఖ్యానం చేశానని నటుడు నవదీప్ అన్నారు. కొందరు డ్రగ్స్ వ్యవహారంలో కలిసి పనిచేయడం వల్ల తన పేరు బయటికి వచ్చి వుంటుందేమోనని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నిజంగా డ్రగ్స్ వాడడంపై తనకు ఎలాంటి అవగాహన లేదని, నిజానిజాలు తెలుసుకోకుండా తమ పేర్లు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. నిజానిజాలు బయటికి రావడానికి కొంత సమయం పడుతుందని, అంతవరకూ అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు. డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ కాల్‌లిస్టులో తమ పేర్లు ఉండడంతో సినీనటుడు సుబ్బరాజు కూడా తన స్పందన తెలియజేశారు. తనకు నిన్ననే నోటీసులు అందాయని, ఈనెల 21న సిట్ ఎదుట తాను హాజరుకానున్నానని, అయితే కెల్విన్ కాల్‌లిస్టులో తన పేరు ఎందుకు వుందో, ఎందుకు నోటీసులు వచ్చాయో తనకు తెలియదని అన్నారు.
కొన్నిరోజులు ఆగితే ఈ విషయంపై స్పష్టమైన అవగాహన అందరికీ వస్తుందని తన స్నేహితులలో డ్రగ్స్‌వాడే అలవాటు వున్నవారు ఎవరూ లేరు అని ఆయన తెలిపారు. ‘నేను నా జీవితంలో డ్రగ్స్ ఏనాడూ చూడలేదని, నాకు ఎటువంటి నోటీసులు అందలేద’ని వర్థమాన నటుడు నందూ తెలిపారు. డ్రగ్స్ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదని, మీడియాలో తన పేరు రావడంపట్ల ఆవేదన కలిగిందని ఆయన అన్నారు. ఇంకా పూరి జగన్నాధ్, ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, హీరో రవితేజ, తనీష్ తదితరుల పేర్లు కూడా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. త్వరలో వీరు కూడా వివరణ ఇవ్వనున్నారు. ఎక్సయిజ్ అధికారుల దర్యాప్తు అనంతరం నేడో రేపో ‘డ్రగ్స్ వాడుతున్న సినీ ప్రముఖుల’కు సంబంధించి రెండో జాబితా విడుదల కానున్నదని తెలుస్తోంది. అందులో ఎంతమంది వుంటారో వేచి చూడాల్సిందే! కాగా శుక్రవారం నటుడు నందూ ఎకైజ్ అధికారుల కార్యాలయానికి వెళ్లి తన సంజాయిషీని తెలియజేశారు.