నలుగురు హీరోలూ మెప్పించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బానర్‌పై తెరకెక్కిన ‘శమంతకమణి’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన విశేషాలు.
అద్భుతమైన స్పందన
సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఎక్కడ చూసినా అద్భుతంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో సహకరించిన మా నలుగురు హీరోలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ చిత్రంలో నలుగురు హీరోలు కనబడకుండా కేవలం పాత్రల్లో జీవించారు.నలుగురి పాత్రలూ అద్భుతంగా ఉన్నాయంటూ అభినందిస్తున్నారు.
కథ ప్రకారమే
కథ అనుకున్నప్పుడు నలుగురు హీరోలైతే బాగుంటుందని వీరిని కలిసాను. కథ చెప్పినప్పుడు బాగుంది, తప్పకుండా చేద్దామని వారు ఇచ్చిన సపోర్టుపై సినిమా అంత బాగా వచ్చింది. ఎవరి పాత్రల్లో వారు చక్కగా కుదిరారు. ఈ చిత్రంలోని కీలకపాత్రలో ఉన్న కారు కూడా అనుకున్నట్టుగా దొరకడం లక్కీ.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం కథలు ఉన్నాయి, ఈసారి క్రైమ్ కామెడీ కాకుండా వేరే జోనర్‌లో సినిమా తీస్తా.

-యు