వేగం పెంచిన బాలయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య 102వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. రాయలసీమ రాజకీయ, ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్‌గా నటించే ఈ చిత్రం ఆగస్టు మొదటి వారంలో సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుపుకుంటోంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి బాలకృష్ణ వంద సినిమాల తరువాత స్పీడ్ పెంచడం విశేషం. ఇప్పటికే 103వ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఈ చిత్రాన్ని వారాహి బానర్‌పై తెరకెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.