బాలయ్యతో బోయపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘పైసా వసూల్’ పూర్తి కావచ్చింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత బాలయ్య తన 102వ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. వచ్చే నెల 3న ఈ సినిమా మొదలుకానుంది. దీని తరువాత ఆయన బోయపాటి దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలయ్యకు బోయపాటి సింహ, లెజెండ్ లాంటి సంచలన విజయాలను అందించాడు. వాటి తరువాత ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట బోయపాటి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ సినిమా చేస్తున్న బోయపాటి వెంటనే బాలయ్యతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. మరోవైపు చిరంజీవితో కూడా ఓ సినిమా ఉంటుందట. మరి ఈ రెండింటిలో ఏది మొదట ప్రారంభం కానుందో చూడాలి. బోయపాటి దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్‌పై తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.