నచ్చిన మణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది కథానాయకులుగా భవ్య క్రియేషన్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘శమంతకమణి’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ- సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని, కథే ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణంగా నిలిచిందని తెలిపారు. నలుగురు హీరోలతో కలిసి పనిచేయడం బాగుందని, ఇలాంటి ప్రయాణం మొదలుపెట్టిన తమకు మరిన్ని మంచి సినిమాలు రావాలని సందీప్‌కిషన్ అన్నారు.
మంచి వౌత్ టాక్ పొందిన ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను నమ్మి అందరూ నటించారని, మంచి విజయం సాధించడం కథలో వైవిధ్యాన్ని తెలియజేస్తోందని, కుటుంబం అంతా కలిసి చూడదగిన విధంగా ఉంటుందని మరో హీరో ఆది అన్నారు. ఎమోషన్ సీన్లకు మంచి రెస్పాన్స్ థియేటర్‌లలో కనబడుతోందని, సెకెండాఫ్‌లో పబ్ సన్నివేశం అందరికీ నచ్చిందని నటుడు సుధీర్‌బాబు తెలిపారు.
చాలామంది ఈ సినిమా చూసి ట్విట్టర్‌లో సందేశాలు పెడుతున్నారని, తన కలను నిజం చేసిన హీరోలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెలిపారు. లౌక్యం తరువాత తమ సంస్థ రూపొందించిన ఈ చిత్రానికి వంద శాతం ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ లభించిందని, ముత్యాలులాంటి నలుగురు హీరోలు నటించారని నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొని విశేషాలను తెలిపారు.