అదిరిపోనున్న స్పైడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ సినిమా దసరా బరిలో నిలిచింది. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఒక్క తెలుగులోనే దాదాపు 80 కోట్ల బిజినెస్ జరిగినట్టు టాక్. క్రేజీ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళ రిలీజ్ హక్కులను దాదాపు 20 కోట్లకు విక్రయించారట. బాలీవుడ్‌లో ధర్మా ప్రొడక్షన్స్ భారీ ధరకు హిందీ హక్కులను స్వంతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. టీజర్ తరువాత సినిమాపై భారీ అంచనాలు పెరగడంతో బిజినెస్ వర్గాల్లో కూడా అంచనాలు రెట్టింపయ్యాయి. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 200 కోట్ల వరకూ బిజినెస్ జరుగుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాకు అప్పుడే జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. బాహుబలి తరువాత ఆ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న చిత్రమిదే. విజువల్ వండర్‌గా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ ఐ రోబో సినిమాకు వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారట. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.