నో రీమేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘జై లవకుశ’ షూటింగ్‌లో బిజీగా వున్న ఎన్టీఆర్ మరోవైపు బిగ్‌బాస్ టీవీ షోను నడిపిస్తున్న విషయం తెలిసిందే. జై లవకుశ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. దీన్ని దసరాకు విడుదల చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు దర్శకుడు బాబీ. ఈ సినిమా తరువాత కొరటాల శివ, త్రివిక్రమ్‌లతో ఎన్టీఆర్ పనిచేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ముందు త్రివిక్రమ్ సినిమా ప్రారంభం కానుంది. తాజాగా ఎన్టీఆర్ మరో కొత్త సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా రీమేక్ సినిమా కావడం విశేషం. తాజాగా కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ నటించిన రాజా కుమార చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ రీమేక్ చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే కన్నడ దర్శక నిర్మాతలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. అయితే తారక్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ రీమేక్ చేయడం లేదని, దీనికి సంబంధించి ఎవరితోతూ చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ నటిస్తారని వస్తున్న రూమర్లకు చెక్ పడింది. ప్రస్తుతం జై లవకుశ చిత్రంలో ఏకంగా మూడు పాత్రలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.