దీపావళికి నాగ్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున నటిస్తున్న తాజా సినిమాకు ఇప్పుడు విడుదల తేదీ ఖరారైంది. నాగార్జున ఓ దెయ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజుగారి గది చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రాజుగారి గది-2లో నటిస్తున్నారు ఆయన. సీరత్ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సమంత ఓ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. తాజాగా పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి అక్టోబర్ 12న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్‌తోపాటుగా సిజి కార్యక్రమాలు అన్నీ ఆగస్టు నెలాఖరుకు పూర్తి కానున్నాయి. విడుదల తేదీ విషయంలోనే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సెప్టెంబర్ అంతా పెద్ద సినిమాల హంగామా వుండడంతో అక్టోబర్‌లో దీపావళి పండుగకు ముందు వీకెండ్‌కు సినిమా విడుదల చేయడానికి యూనిట్ సమాయత్తమవుతోంది. ఈ చిత్రంలో దయ్యంగా సమంత నటించిందని వార్తలు వినిపిస్తున్నాయి. మానసిక శక్తులను ప్రదర్శించే ఓ మాంత్రికుడి పాత్రలో నాగార్జున నటించారట!