గల్ఫ్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్ మద్దినేని, డిపుల్ చోప్‌డే, సంతోష్ పవన్ ప్రధాన తారాగణంగా శ్రావ్యా ఫిలింస్ పతాకంపై చేతన్ మద్దినేని హీరోగా పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్.రామ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘గల్ఫ్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కాగా, పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. గల్ఫ్ దేశాల వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ ఆడియో వేడుక ఆహూతులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగినీడు మాట్లాడుతూ- దర్శకుడు ఈ చిత్రాన్ని మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారని, అన్ని పాటలు విభిన్నంగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ- శివ పాత్రతో గల్ఫ్ చిత్రంలో నటించిన చేతన్, గల్ఫ్ వలసల జీవితంలో బ్లూ కాలర్ వర్కర్లకు ప్రతినిధిగా ఈ సినిమాలో నటించాడని, దాదాపు 25 లక్షల మంది తెలుగు రాష్ట్రాలనుండి గల్ఫ్‌కు ఉపాధికై వెళ్లారని, వారి జీవన చిత్రాన్ని వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాలో రూపొందించారని ఆయన అన్నారు.