టాప్ టెన్ కథల్లో గౌతమ్‌నంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవాన్ రమణ మహర్షి రాసిన కథను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా గౌతమ్‌నంద చిత్రాన్ని తెరకెక్కించానని అంటున్నాడు సంపత్ నంది. ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి చిత్రాలతో కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, తాజాగా గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం గౌతమ్‌నంద. ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు సంపత్ నందితో ఇంటర్వ్యూ..
* గౌతమ్‌నంద ఎలా ఉంటాడు?
- పక్కా కమర్షియల్ కంటెంట్‌తో ముఖ్యంగా ఇప్పటివరకూ రాని కానె్సప్టుతో తెరకెక్కించిన చిత్రమిది. గోపీచంద్ రెండు భిన్నమైన షేడ్స్ వున్న పాత్రలో కనిపిస్తాడు. గౌతమ్ ఘట్టమనేని అనే వ్యక్తి గౌతమ్‌నందాగా ఎలా మారాడు అనేది కథ. అంటే, బాగా డబ్బున్న వ్యక్తి ఎలా మంచి మనిషిగా మారాడు అన్న ప్రయాణమే ఈ సినిమా.
* ఈ కథ ఎలా పుట్టింది?
- రమణ మహర్షి ‘హూ యామ్ ఐ’ అనే ప్రశ్న ఆధారంగా ఈ కథ పుట్టింది. నేను ఇంతవరకూ తీసిన సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్‌తోనే ఉండేవి. అయితే, బలమైన కథని, ఫ్లాష్‌బ్యాక్‌ని చెప్పలేకపోయానేమోనని అనిపించింది. అందుకనే ఈసారి పాత్రతోపాటు బలమైన కథను అల్లుకొని ఈ సినిమా చేశాను. తప్పకుండా నా నమ్మకం నిజవౌతుంది.
* ఇలాంటి సబ్జెక్టులు ఛాలెంజింగ్ కాదా?
- కథ రాసేటప్పుడే నాకు చాలా సంతృప్తి కలిగింది. సినిమా పూర్తయ్యాక దానికి రెట్టింపు ఆనందాన్ని పొందాను. ఇలాంటివి చేస్తేనే మనలోని సత్తా బయటికొచ్చేది. కథ చెప్పినపుడే గోపీచంద్ ఎగ్జైట్ అయ్యారు. నేను చెప్పిన విధానం కానీ లేక కథలోని గ్రిప్పింగ్ ఆయనకు బాగా నచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ చేద్దామన్నారు.
* గోపీచంద్ పాత్ర ఎలా వుంటుంది?
- కథ రాసుకున్నపుడే ఈ పాత్రను డిజైన్ చేశాను. వాటికి సంబంధించిన స్కెచెస్ చూసి గోపీచంద్ షాకయ్యారు. రిచ్ పర్సన్ ఎలా వుంటాడు, ఏం వాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని ప్రతీ విషయాన్ని తెలుసుకొని ఈ పాత్రను మలిచాను. గెటప్, కాస్ట్యూమ్స్ వంటి విషయంలో కొత్త లుక్‌తో ట్రై చేశాం. దానికి గోపీచంద్ సహకారం మరువలేనిది.

* ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు?
- భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది. ఇదే ఈ సినిమా. ఒక మనిషి తన జీవిత ప్రయాణంలో నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నతోనే ఈ సినిమా ప్రారంభమవుతుంది.
* సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ ఎక్కువ వస్తోంది?
- బెంగాల్ టైగర్ తరువాత ఏడాదిన్నర అయ్యింది. నిజానికి గౌతమ్‌నంద జూలైలో మొదలుపెట్టి జూలైలో విడుదల చేస్తున్నాం. సినిమాకోసమే ఏడాది పట్టింది. అంతకుముందు కథ రాయడానికి మరో ఆరు నెలలు. గ్యాప్ అనేది కావాలనే తీసుకున్నది కాదు.
* హీరోయిన్ల గురించి?
- ఇందులో ఒక బంగారు షాపులో పనిచేసే సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా హన్సిక నటించింది. హీరోకి స్ఫూర్తిని నింపే పాత్ర తనది. అలాగే బాగా రిచ్‌గా వుండి, అందంతోపాటు గ్లామర్‌ను మిక్స్ చేసిన అమ్మాయిగా కేథరిన్ కనిపించింది. ఇద్దరూ అద్భుతంగా నటించారు.
* పవన్‌తో సినిమా ఎప్పుడు?
- ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమా చేయడానికి సిద్ధం.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతానికి ఓ కథను సిద్ధం చేస్తున్నాను. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తా. ఇక నిర్మాతగా చేస్తున్న పేపర్‌బాయ్ సినిమా రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది.

- శ్రీ