బాస్.. ఎవరికి ఛాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా సాగుతోన్న బిగ్‌బాస్‌కి మంచి టిఆర్‌పి రేటింగ్సే దక్కుతున్నాయి. షోలో పార్టిసిపేంట్స్ మాటెలావున్నా, హోస్ట్ ఎన్టీఆర్‌కంటూ సెపరేట్ పాపులార్టీ ఉంది కనుక, తెలుగులో షో అనుకున్న దానికంటే బాగానే పాపులరవుతోంది. షో పాపులార్టీని దృష్టిలో పెట్టుకుని, మొదట్లో వద్దనుకున్న వాళ్లంతా ఇప్పుడు ఎంటరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్. అనివార్య కారణాలతో బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసిన సంపూర్ణేష్‌బాబు స్థానంలో మరో కంటెస్టెంట్‌ని తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకోసం ముగ్గురు హాట్ భామల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తేజస్వి, రష్మీ, హంసానందినిలు సంపూర్ణేష్ స్థానం కోసం రేసులో ఉన్నట్టు సమాచారం. షో ఆరంభంలో వీరి ముగ్గురు పేర్లూ వినిపించినా, అప్పట్లో అంత ఆసక్తి చూపించలేదని కథనాలు వినిపించాయి. ఇప్పుడు షో హిట్టవుతుండటంతో, అరుదైన అవకాశం ఎవరికి దక్కుతుందోనని బిగ్‌బాస్ ప్రియుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వీరు ముగ్గురు తమ పెర్ఫార్మెన్స్‌తో వెండితెరని వేడెక్కించిన వారే. దీంతో వీరిలో ఎవరిని బిగ్ బాస్‌లోకి తీసుకున్నా షో మరింత ఆసక్తికరంగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది.