మళ్లీ లీకయ్యాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరుగుతున్నఅంచనాలే జై2కొంపముంచుతాయా? ఇప్పుడు ఇండస్ట్రీని ముసురుతున్న అనుమానాలివి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశ. ఎన్టీఆర్‌కు జోడీగా రాశీఖన్నా, నివే దా థామస్ కనిపించనున్నారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడన్న సమాచారం బయటపడిన దగ్గర్నుంచీ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా విలన్ షేడ్స్ లో కనిపించనున్న జై2పాత్ర మరింత ఆసక్తిదాయకంగా మారింది. దీంతో ఆ మధ్య జై కి సంబంధించిన సమాచారం బయటకు రావడంతో ఒకింత వివాదాస్పదమైంది, అంతకుమించి ఆసక్తినీ రేకెత్తించింది. టీజర్‌కు సంబంధించిన కొన్ని షాట్స్ లీకయ్యాయని, ఆ లీకు2వీరుడు గణేశ్ అంటూ సాంకేతిక వర్గంలోని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఆ లీకు సంగతి ఇంకా కొలిక్కి రాకముందే, మళ్లీ ఇప్పుడు జై ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాడు. జై పాత్ర పరిచయ గీతంగా కంపోజ్ చేసిన రావణ సాంగ్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇదెక్కడి లీకుల గోలరా బాబూ అంటూ యూనిట్ గగ్గోలు పెడుతోంది. అయితే, ఇదీ యూనిట్‌లో ఉన్నవాళ్లెవరైనా ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారా? లేక సినిమాపట్ల మరింత క్రేజ్ పెంచేందుకు జరుగుతోన్న స్టంటా? అన్నది తేలాల్సి ఉంది.