లక్ష్యాలు వర్సెస్ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దర్శకుడు’ సినిమాలో ప్యాషన్ డిజైనర్ నమ్రతగా కనిపించబోతోంది ఈష. జీవితంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనే తపనవున్న యువతిగా కనిపిస్తా అంటోంది. ఔత్సాహిక దర్శకులతో ఆమె పరిచయం ప్రేమకు ఎలా దారితీసిందీ, ఆ ప్రయాణంలో వారికి ఎదురైన అనుభవాలేమిటి? వృత్తిపరమైన లక్ష్యాలు, ప్రేమ మధ్య ఇద్దరి సంఘర్షణ ఎలా ఉంటుంది? అనే అంశాల సమాహారంగా చిత్రం సాగుతుందని నటి ఈష తెలిపారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో సుకుమార్, బిఎన్‌సిఎస్‌పి విజయకుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం -దర్శకుడు. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి ఈష చిత్ర విశేషాలు వెల్లడించింది.
యువతరం సినిమా
నేటి యువతరంతోపాటు కుటుంబీకులనూ మెప్పించే అందమైన ప్రేమకథ. ప్రేమకథలు ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికీ సినిమా నచ్చుతుంది. చిత్రంలో ఓ జానపద నృత్యం చేయడం కొత్త అనుభూతి. ఇంకా ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నా.
సుక్కు మెచ్చుకున్నారు..
దర్శకుడు సుకుమార్ సంస్థలో పనిచేయడమే అదృష్టం. నా నటనకు ఆయన ప్రశంసలు దక్కడం మరింత అదృష్టం, మహాదానందం. నేను ఇప్పటివరకూ చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను చేశాను. ప్రతి పనిలో ఉత్సాహంగా ఉండే చలాకీ అమ్మాయిగా అలరిస్తా. సుకుమార్ ప్రశంస గొప్ప కాంప్లిమెంట్‌గా ఫీలవుతున్నా.
హీరోని కొడితే!
కథానుగుణంగా రెండు సందర్భాల్లో హీరోను చెంపదెబ్బలు కొట్టాల్సి వచ్చింది. అ లా ఎందుకు చేయాల్సి వచ్చిందో సినిమా చూస్తే తెలుస్తుంది. నిజ జీవితంలో నేనిప్పటివరకూ ఏ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టలేదు. సినిమా నేపథ్యంలో సినిమా సాగినా, ఇం దులో సినిమా కష్టాలుండవు. ఓ ఔత్సాహిక దర్శకుడి ప్రేమాయణానికి దర్పణం-దర్శకుడు.
గ్లామర్‌కు ఓకె..
పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉంది. హద్దులు దాటని గ్లామర్ పాత్రలు చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. నటిగా ప్రతిభను ప్రదర్శించే ఛాలెంజిం గ్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నా. ఫిదా చిత్రంలో భానుమతి పాత్ర బాగా నచ్చింది. అలాం టి పాత్ర వస్తే తప్పకుండా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రస్తుతం కెరియర్ సోసో గా సా గిపోతోంది. చాలా చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

- శ్రీ